తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఐఎన్​ఎక్స్​ మీడియా: చిదంబరం సీబీఐ కస్టడీ పొడిగింపు - తుషార్​ మెహ్తా

ఐఎన్​ఎక్స్​ మీడియా మనీలాండరింగ్​ కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరానికి సోమవారమంతా ప్రతికూలంగానే నడిచింది. తొలుత సీబీఐ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్​ పిటిషన్​ను తిరస్కరించింది అత్యున్నత న్యాయస్థానం. అనంతరం.. చిదంబరం సీబీఐ కస్టడీ విచారణను మరో 4 రోజులు పొడిగించింది దిల్లీ రోస్​ అవెన్యూ కోర్టు.

చిదంబరం సీబీఐ కస్టడీ పొడిగింపు

By

Published : Aug 26, 2019, 6:02 PM IST

Updated : Sep 28, 2019, 8:39 AM IST

చిదంబరం సీబీఐ కస్టడీ పొడిగింపు

'ఐఎన్​ఎక్స్​ మీడియా' అవినీతి కేసులో అరెస్టయిన చిదంబరం సీబీఐ కస్టడీ విచారణను మరో 4 రోజులు పొడిగించింది దిల్లీ రోస్​ అవెన్యూ కోర్టు. పూర్తి దర్యాప్తు ఇంకా ముగియలేదని.. మరో 5 రోజులు రిమాండ్​ను పొడిగించాలని దిల్లీ కోర్టును కోరింది సీబీఐ. దాదాపు 40 నిమిషాల పాటు.. సొలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహ్తా, అదనపు సొలిసిటర్​ జనరల్​ నటరాజన్​లు కేంద్ర దర్యాప్తు సంస్థ తరఫున వాదనలు వినిపించారు.

అనంతరం దిల్లీ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి అజయ్​ కుమార్..​ చిదంబరం కస్టడీని మరో 4 రోజులు పొడిగిస్తూ తీర్పు వెలువరించారు. ఆగస్టు 30న తిరిగి కోర్టు ముందు హాజరుకానున్నారు కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి. అప్పటివరకు చిదంబరాన్ని ప్రశ్నించనుంది సీబీఐ.

బెయిల్​ పిటిషన్​ తిరస్కరణ.. మధ్యంతర రక్షణ పొడిగింపు

ఐఎన్​ఎక్స్​ మీడియా కేసులో చిదంబరానికి ఈడీ అరెస్టు నుంచి మధ్యంతర రక్షణను రేపటివరకు పొడిగించింది సుప్రీం కోర్టు. నేడు అత్యున్నత న్యాయస్థానంలో చిదంబరం తరఫున వాదనలు ముగిశాయి. అనంతరం విచారణను ఆగస్టు 27కు వాయిదా వేసింది అత్యున్నత న్యాయస్థానం. ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్ రేపు​ వాదనలు కొనసాగించనుంది.

అంతకుముందు కాంగ్రెస్​ సీనియర్​ నేతకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఐఎన్​ఎక్స్​ మీడియా కేసులో తనకు ముందస్తు బెయిల్​ నిరాకరిస్తూ దిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్​ చేస్తూ.. చిదంబరం దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇప్పటికే అరెస్టయినందున విచారణ అర్థరహితమని కోర్టు పేర్కొంది.

కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి తరఫున కాంగ్రెస్​ సీనియర్​ నేత, న్యాయవాది కపిల్​ సిబల్​.. ఈడీ తరఫున సొలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహ్తా వాదనలు వినిపించారు.

Last Updated : Sep 28, 2019, 8:39 AM IST

ABOUT THE AUTHOR

...view details