ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం బెయిల్ పిటిషన్‌పై నేడు సుప్రీం కోర్టు విచారణ చేపట్టనుంది. బెయిల్ పిటిషన్‌పై సుప్రీం నాయ్యమూర్తులు జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ హృషికేశ్ రాయ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేయనుంది.
ఐఎన్ఎక్స్ మీడియా అవినీతి కేసులో బెయిల్ పిటిషన్‌ను సెప్టెంబర్ 30న దిల్లీ హైకోర్టు తిరస్కరించటాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు చిదంబరం.
ఈ కేసుకు సంబంధించి కేంద్ర మాజీ మంత్రిని ఆగస్టు 21న అరెస్ట్ చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ). కోర్టు ఆదేశాలతో జ్యుడిషియల్ కస్టడీ నిమిత్తం తిహార్ జైలుకు తరలించింది. సీబీఐ వినతి మేరకు గురువారం మరోమారు ఈ నెల 17 వరకు కస్టడీని పొడగించింది దిల్లీ హైకోర్టు.