కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి దిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ఐఎన్ఎక్స్ మీడియా, ఎయిర్సెల్-మ్యాక్సిస్ కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్ను జస్టిస్ సునీల్ గౌర్ నేతృత్వంలోని ధర్మాసనం తిరస్కరించింది.
ఎయిర్సెల్-మ్యాక్సిస్ కేసుల్లో సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లు రెండూ చిదంబరానికి వ్యతిరేకంగా కోర్టులో తమ వాదనను వినిపించాయి. సమగ్ర విచారణకు చిదంబరాన్ని అరెస్టు చేసేందుకు అనుమతించాలని కోరాయి.
చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు 2007లో ఐఎన్ఎక్స్ మీడియాకు సంబంధించిన రూ.305 కోట్ల విదేశీ ఫండ్ల అవకతవకల్లో చిదంబరం హస్తమున్నట్లు అభియోగాలున్నాయి. ఈ కేసులో చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం సహా పలువురిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి.