తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీ హైకోర్టులో చిదంబరానికి చుక్కెదురు

దిల్లీ హైకోర్టులో చిదంబరానికి చుక్కెదురు

By

Published : Sep 30, 2019, 3:22 PM IST

Updated : Oct 2, 2019, 2:32 PM IST

15:58 September 30

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్​ సీనియర్​ నేత పి.చిదంబరానికి దిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ఐఎన్​ఎక్స్​ మీడియా అవినీతి కేసులో ఆయనకు బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించింది న్యాయస్థానం. ఈ కేసులో చిదంబరం  ఆధారాలను తారుమారు చేసే అవకాశం లేకపోయినా.. సాక్షులను ప్రభావితం  చేయొచ్చని న్యాయస్థానం అభిప్రాయపడింది. అందుకే బెయిల్​ నిరాకరిస్తున్నట్లు స్పష్టం చేసింది. 

ఐఎన్ఎక్స్​ మీడియా కేసులో ఆగస్టు 21న చిదంబరాన్ని అరెస్టు చేసింది సీబీఐ. న్యాయస్థానం ఆయనకు అక్టోబరు 3వరకు జుడీషియల్ కస్టడీ విధించింది. ప్రస్తుతం ఆయన తిహార్ జైల్లో ఉన్నారు. 

చిదంబరం ఆర్థికమంత్రిగా ఉన్న సమయంలో ఐఎన్​ఎక్స్​ మీడియాకు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు అనుమతులు ఇవ్వడంలో అక్రమాలకు పాల్పడ్డారన్నది ప్రధాన ఆరోపణ. మొత్తం రూ.305కోట్ల అవినీతి జరిగిందని 2017 మే 15న ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది సీబీఐ. అ తర్వాత ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది.

15:19 September 30

దిల్లీ హైకోర్టులో చిదంబరానికి చుక్కెదురు

ఐఎన్​ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి దిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన బెయిల్​ పిటిషన్​ను న్యాయస్థానం తోసిపుచ్చింది. బెయిల్ ఇస్తే సాక్షులను చిదంబరం ప్రభావితం చేసే అవకాశముందని అభిప్రాయపడింది.

ప్రస్తుతం చిదంబరం తిహార్​ జైలులో ఉన్నారు. 
 

Last Updated : Oct 2, 2019, 2:32 PM IST

ABOUT THE AUTHOR

...view details