ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరంపై దిల్లీకోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ). ఈ చార్జ్‌షీట్‌లో మాజీ మంత్రి కుమారుడు కార్తీ చిదంబరం, ఐఎన్ఎక్స్ మాజీ ప్రమోటర్లు ఇంద్రాణి- పీటర్ ముఖర్జీలు సహా 14 మందిపై చార్జ్‌షీట్ దాఖలైంది.
ఐఎన్ఎక్స్ కేసు: చిదంబరంపై సీబీఐ చార్జ్‌షీట్ - ఐఎన్ఎక్స్ కేసు
కాంగ్రెస్ నేత చిదంబరం చుట్టు ఉచ్చు బిగుస్తోంది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రిపై చార్జ్‌షీట్ దాఖలు చేసింది సీబీఐ. ఈ చార్జ్‌షీట్‌లో కార్తీ చిదంబరం సహా 14మంది పేర్లు ఉన్నాయి.
ఐఎన్ఎక్స్ కేసు: చిదంబరంపై సీబీఐ చార్జ్‌షీట్
కాంగ్రెస్ నేత చిదంబరాన్ని అక్టోబర్ 24 వరకు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ, నిర్బంధ విచారణ చేయడానికి గురువారం అనుమతినిచ్చింది దిల్లీ కోర్టు. ఆయనకు ప్రత్యేక గది, ఇంటి భోజనం, మందులు, కళ్లద్దాలు, వెస్ట్రన్ టాయిలెట్ సౌకర్యాలు కల్పించాలని ఆదేశించింది. సీబీఐ నమోదు చేసిన కేసులో చిదంబరం జ్యుడీషియల్ కస్టడీని అక్టోబర్ 24 వరకు పొడిగించింది న్యాయస్థానం.
ఇదీ చూడండి:- అసోం ఎన్ఆర్సీ రూపకర్త బదిలీకి సుప్రీం ఆదేశాలు
Last Updated : Oct 18, 2019, 3:29 PM IST