అయోధ్య రామ మందిర భూమి పూజకు బాబ్రీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 32 మంది నిందితులను ఆహ్వానించాలని పేర్కొన్నారు హిందూధర్మ సేన అధ్యక్షుడు సంతోష్ దుబే. భూమి పూజ సందర్భంగా వారిని సన్మానించాలని పేర్కొన్నారు. ఆగస్టు 5న జరగనున్న భూమిపూజ కార్యక్రమానికి నలుగురు శంకరాచార్యులను ఆహ్వానించాలని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు విన్నవించారు.
"శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్వాహకులు బాబ్రీ కేసులో నిందితులుగా ఉన్న 32 మందిని, రామ మందిర ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన కరసేవకుల కుటుంబసభ్యులను భూమి పూజకు ఆహ్వానించాలి. అక్కడ వారిని సన్మానించాలి."
-సంతోష్ దుబే, హిందూ ధర్మసేన అధ్యక్షుడు
ఒకవేళ కరసేవకులను ఆహ్వానించకపోతే దానిని అహంభావంగానే భావించాల్సి వస్తుందని చెప్పారు దుబే. భూమి పూజ కార్యక్రమం అసంపూర్తిగా మిగిలిపోతుందని వ్యాఖ్యానించారు.