మధ్యప్రదేశ్ ప్రభుత్వంపై వ్యంగాస్త్రాలు సంధించారు ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, భాజపా సీనియర్ నేత శివరాజ్‌సింగ్ చౌహాన్. రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ కోతల కారణంగా పెట్టుబడిదారులు మధ్యప్రదేశ్‌లో లాంతరు ఫ్యాక్టరీలు పెట్టాలనుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
"మా ప్రభుత్వ పాలనలో ఇన్వర్టర్ల అవసరం కూడా లేకుండా చేశాం. లాంతర్లు, ఇతర దీపాల అమ్మకాలూ పూర్తిగా నిలిచిపోయాయి. కానీ ప్రస్తుతం అనేక మంది వ్యాపారులుమధ్యప్రదేశ్లోఇన్వర్టర్లు, లాంతరు ఫ్యాక్టరీలు పెట్టేందుకు యోచిస్తున్నారు." -శివరాజ్‌సింగ్ చౌహన్, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి