పాస్‌పోర్ట్ భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు చిప్ పొందుపరిచిన ఈ-పాస్‌పోర్ట్‌లను జారీ చేయనున్నట్లు వెల్లడించారు విదేశాంగమంత్రి ఎస్. జైశంకర్. ‘‘చిప్ ఆధారిత ఈ-పాస్‌పోర్ట్‌ల కోసం ప్రస్తుతం ఇండియన్ సెక్యూరిటీ ప్రెస్ నాసిక్, నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్‌తో కలిసి పనిచేస్తున్నట్లు చెప్పారు. ఈ-పాస్‌పోర్ట్ ప్రయాణ పత్రాలకు మరింత భద్రత కల్పిస్తుందని వెల్లడించారు. దీనికి సంబంధించిన పనులను ఇప్పటికే ప్రారంభించామని పేర్కొన్న జైశంకర్.. ప్రస్తుతం ఈ- పాస్‌పోర్ట్‌ల అవసరం ఎంతో ఉందని నొక్కి చెప్పారు.
ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో..
పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు (పీఎస్‌కే) లేని ప్రతి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో త్వరలో పోస్టాఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు మంత్రి. ఇప్పటి వరకు 488 లోక్‌సభ నియోజక వర్గాల్లో ఈ సేవలు అందించామని.. ఎంతో వేగంగా పూర్తి చేయాల్సిన ఈ కార్యక్రమం కరోనా కారణంగా ఆలస్యం జరిగిందని చెప్పారు. వీటిని త్వరలోనే పూర్తి చేస్తామని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇక సులభతరంగా పాస్‌పోర్ట్ జారీ..