ఇంటర్‌పోల్ 91వ సర్వసభ్య సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది.2022లో భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశంలో ఇంటర్‌పోల్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇంటర్ పోల్ ప్రధాన కార్యదర్శి జర్గెన్ స్టాక్... ఆగస్టులో భారత పర్యటన సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ ప్రతిపాదన చేసినట్లు సమాచారం.
'ఇంటర్‌పోల్' సర్వసభ్య సమావేశానికి భారత్ ఆతిథ్యం - ఇంటర్‌పోల్ సెక్రటరీ జనరల్ జర్గెన్ స్టాక్
2022లో జరగనున్న ఇంటర్‌పోల్ 91వ సర్వసభ్య సమావేశాన్ని భారత్ నిర్వహించనుంది. ఇంటర్ పోల్ సెక్రటరీ జనరల్ జర్గెన్ స్టాక్ ఆగస్టులో భారత్‌లో పర్యటించిన సమయంలో కేంద్ర మంత్రి అమిత్ షా ఈ ప్రతిపాదన చేసినట్లు సమాచారం.
'ఇంటర్‌పోల్' సర్వసభ్య సమావేశానికి భారత్ ఆతిథ్యం..!
194 సభ్య దేశాలు గల ఇంటర్‌పోల్‌లో 1949లో చేరింది భారత్. అంతర్జాతీయ నేరాలు, నేరస్థుల సమాచారాన్ని పంచుకోవడానికి సభ్య దేశాల్లోని పోలీసులకు ఇంటర్‌పోల్ సాయపడుతుంది. పాలకమండలి నిర్ణయాలు తీసుకోవడానికి సంవత్సరానికోసారి జనరల్ అసెంబ్లీ సమావేశమవుతుంది. భారత్ 1997లో మాత్రమే ఇంటర్‌పోల్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించింది. 2019 ఇంటర్‌పోల్ సర్వసభ్య సమావేశం చిలీలో జరిగింది.
ఇదీ చూడండి:అట్టహాసంగా చైనా మిలటరీ క్రీడల ప్రారంభోత్సవం