అసోంలో అంతర్జాల సేవలు పునరుద్ధరించారు. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలతో పదిరోజులుగా అంతర్జాల సేవలు నిలిపివేయగా.. ఈ ఉదయం 9 గంటల నుంచి పునరుద్ధరించామని టెలికాం దిగ్గజ సంస్థ ఎయిర్‌టెల్ వెల్లడించింది. అంతర్జాల సేవలపై ఉన్న నిషేధాన్ని కొనసాగించాలని తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని, అందుకే నిషేధాన్ని ఎత్తివేశామని తెలిపింది.
10 రోజుల తర్వాత అసోంలో ఇంటర్నెట్ సేవలు - telecom services in assam
పౌరసత్వ చట్ట వ్యతిరేక నిరసనల నేపథ్యంలో అసోంలో అంతర్జాల సేవలపై విధించిన నిషేధాజ్ఞలను 10 రోజుల తర్వాత ఎత్తివేశారు. టెలికాం సేవలను పునరుద్ధరించినట్లు ఎయిర్‌టెల్ అధికారిక ప్రకటనలో తెలిపింది.
అసోం హైకోర్టు గురువారం సాయంత్రమే ఇంటర్నెట్‌పై ఉన్న నిషేధాన్ని ఎత్తేయాలని ఆదేశించింది. ఈ రోజు ఉదయం నుంచి నిషేధం ఎత్తేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. అసోంలో బ్రాడ్‌బ్యాండ్‌పై ఉన్న నిషేధాన్ని ఇప్పటికే ఎత్తేశారు. ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించినట్ల ప్రకటించిన ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్... అసోంలోని అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటామన్నారు. ఎవరి హక్కుల్నీ హరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: మళ్లీ చెలరేగిన 'పౌర' జ్వాల.. భీమ్ ఆర్మీ నేతల అరెస్టు