కేంద్ర ప్రభుత్వం జస్టిస్ ఎస్.మురళీధర్‌ను దిల్లీ హైకోర్టు నుంచి పంజాబ్, హరియాణా హైకోర్టుకు బదిలీ చేయడంపై అంతర్జాతీయ బార్ అసోసియేషన్ మానవ హక్కుల సంఘం (ఐబీఏహెచ్ఆర్ఐ) ఆందోళన వ్యక్తం చేసింది. మోదీ ప్రభుత్వం తీసుకున్న తొందరపాటు నిర్ణయానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు బహిరంగ లేఖ రాసింది.
"జస్టిస్ ఎస్.మురళీధర్‌ను రాజకీయ ఒత్తిడి కారణంగా అసాధారణ రీతిలో బదిలీ చేశారు. దీని వల్ల భయంకరమైన సామాజిక అశాంతి నెలకొని... భారత న్యాయవ్యవస్థ స్వాతంత్ర్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. చట్టాల అమలు అనేది న్యాయవ్యవస్థ ప్రాథమిక విధి. దీనికి ప్రభుత్వం ఎలాంటి భంగం కలిగించకూడదు. ముఖ్యంగా దిల్లీ అల్లర్ల విషయంలో న్యాయమూర్తి తన సొంత స్వరాన్ని వినియోగించి పోలీసులను మందలించలేదు."- అంతర్జాతీయ బార్ అసోసియేషన్ మానవ హక్కుల సంఘం (ఐబీఏహెచ్ఆర్ఐ)
ప్రశ్నించిన ఒక్కరోజుకే