ఒడిశా జాజ్పుర్ జిల్లాలో ఓ ఐదేళ్ల బాలుడు రహదారిపై వెళ్లే వాహనాలను చూసేందుకు పెద్ద సాహసమే చేశాడు. వాహనాలు కనబడటం లేదని ఏకంగా విద్యుత్ స్తంభం ఎక్కేశాడు. ఆ సమయంలో కరెంట్ లేకపోవడం వల్ల బాలుడు సురక్షితంగా బయటపడ్డాడు.
ఏం జరిగింది?

జాజ్పూర్ జిల్లా కొరే పోలీస్ స్టేషన్ ఎదుట 20వ నంబర్ జాతీయ రహదారిపై వెళ్తున్న వాహనాలను చూసేందుకు దగ్గరలో ఉన్న విద్యుత్ స్తంభం ఎక్కేశాడు బుడతడు. బాలుడితో పాటు తన సోదరి కూడా ఎక్కడానికి ప్రయత్నించింది. వారు స్తంభం ఎక్కే సమయానికి కరెంట్ లేదు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి వారిని చూసి వారించి కిందకి దింపాడు. దీంతో ఇద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులు బాలుడ్ని అలా వదిలేసినందుకు కుటుంబాన్ని వారించారు.
ఇదీ చూడండి:కరోనా వేళా.. రామ మందిర నిర్మాణానికి విరాళాల వెల్లువ
TAGGED:
electric pole in Odisha