తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అక్కడ వేరే కులం వారిని ప్రేమిస్తే మూకదాడే! - Mandua

ఒడిశా మయూర్​బంజ్​ జిల్లా మండ్వా గ్రామస్థులు ఓ ప్రేమజంటపై దారుణానికి ఒడిగట్టారు. కులాంతర ప్రేమ కొనసాగిస్తున్నందుకు ఇరువురిపై మూకదాడికి తెగించారు. అనంతరం నడిరోడ్డులోనే శిరోముండనం చేశారు.

అక్కడ వేరే కులం వారిని ప్రేమిస్తే మూకదాడే!

By

Published : Jun 25, 2019, 2:09 PM IST

Updated : Jun 25, 2019, 3:13 PM IST

ప్రేమజంటపై మూకదాడి

వేర్వేరు కులాలకు చెందిన వారు ప్రేమించుకున్నారనే నెపంతో దురాగతానికి పాల్పడ్డారు ఒడిశా మయూర్​బంజ్​ జిల్లా మండ్వా గ్రామస్థులు. విచక్షణారహితంగా ప్రేమికులిద్దరికీ నడిరోడ్డులో శిరోముండనం చేశారు. అంతటితో ఆగకుండా ఈ దారుణాన్ని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేశారు. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

మయూర్​బంజ్ జిల్లా కరంజియాకు చెందిన అబ్బాయి... అదే జిల్లాలోని మండ్వా గ్రామానికి చెందిన అమ్మాయి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. శనివారం రాత్రి తన ప్రేయసిని కలిసేందుకు మండ్వాకు వెళ్లాడు ప్రేమికుడు. ఇద్దరు ఒక గదిలో కలిసి మాట్లాడుకుంటుండగా... గ్రామస్థుల కంటపడ్డారు. ఈ ప్రేమ జంటను చూసి తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన స్థానికులు వెంటనే మూకదాడి చేశారు. అనంతరం నడిరోడ్డులోనే శిరోముండనం చేశారు.

బాధితులిద్దరికీ పోలీసులు రక్షణ కల్పిస్తున్నారు. ఈ దారుణానికి ఒడిగట్టిన 21 మందిపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు. వీరిలో ముగ్గురిని అరెస్టు చేశారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు.

ఇదీ చూడండి : ఇరాన్​పై అమెరికా తాజా ఆంక్షలతో సర్వత్రా ఆందోళన

Last Updated : Jun 25, 2019, 3:13 PM IST

ABOUT THE AUTHOR

...view details