పాకిస్థాన్ సైన్యం, ఆ దేశ నిఘా సంస్థ ఐఎస్‌ఐ ఏకమై జమ్ము కశ్మీర్‌లోకి భారీగా ఆయుధాలు చేరవేస్తున్నట్లు భారత నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. వారు డ్రోన్లు, ఇతర వ్యవస్థల ద్వారా దేశంలోకి ఆయుధాలను చేరవేస్తున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. కాగా, భారత్‌లోని అన్ని ప్రాంతాలకు చొచ్చుకెళ్లేందుకు కూడా వీరు సదరు వ్యవస్థలను ఉపయోగిస్తున్నట్లు సమాచారం.
జమ్ముకశ్మీర్‌కు భారత నిఘా వర్గాల తీవ్ర హెచ్చరిక - Intelligence warns Pak transporting weapons to Jammu Kashmir by drones
పాక్ సైన్యం, ఆ దేశ నిఘా సంస్థ కలిసి జమ్ముకశ్మీర్‌లో భారీగా ఆయుధాలు చేరవేస్తున్నట్లు భారత నిఘావర్గాలు హెచ్చరించాయి. డ్రోన్లు, ఇతర వ్యవస్థల ద్వారా దేశంలోకి ఆయుధాలు పంపుతున్నట్లు తెలిపాయి. ఆయుధాల పంపిణీకి పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతంలో భారీ డంప్‌ను ఏర్పాటు చేయడాన్ని నిఘా వర్గాలు గుర్తించాయి.
ఎల్‌ఓసీ సమీపంలో ఉన్న ఉగ్రవాదుల లాంచ్‌ప్యాడ్ల వద్ద పాక్ ఆయుధ సమీకరణను పెంచుతున్నట్లు అధికారులు వెల్లడించారు. పాక్ ఆర్మీ, ఐఎస్ఐ, ఉగ్రవాదులు ఏకమై వీటిని సమీకరిస్తున్నట్లు భారత నిఘా వర్గాలు వెల్లడించాయి. ఆయుధాల పంపిణీకి పాక్ ఆక్రమిత కశ్మీరు ప్రాంతంలో భారీ డంప్ ఏర్పాటు చేయడాన్ని గుర్తించినట్టు అధికారులు వివరించారు. ఉగ్రవాద సంస్థ అల్ బదర్-తాలిబన్ కమాండర్ హమీద్‌ఖాన్ రే భారీ డంప్ ఏర్పాటు చేసినట్టు వారు తెలిపారు. డ్రోన్ల ద్వారా కశ్మీర్‌కు పంపేందుకు ఇక్కడ ఆయుధాలను సిద్ధం చేసినట్లు గుర్తించామన్నారు. భారత్‌లో చొరబడేందుకు 70 మందికి పైగా ఉగ్రవాదులు పొంచివున్నారని తెలిపారు.
ఇదీ చదవండి-కరోనా టీకా అధ్యయన ఫలితాలను వెల్లడించిన ఆక్స్‌ఫర్డ్