తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ట్వీట్ల కోసం తారలపై ఒత్తిళ్లు.. దర్యాప్తునకు ఆదేశం! - తారల ట్వీట్లపై అనిల్ దేశ్​ముఖ్

రైతుల ఉద్యమంపై ట్వీట్లు చేయాల్సిందిగా తారలపై ఒత్తిళ్లు వచ్చాయన్న ఆరోపణలపై నిఘా విభాగం దర్యాప్తు చేపట్టనుందని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్​ముఖ్​ స్పష్టం చేశారు. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌, ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్‌ వంటివారు ఇటీవలే కేంద్ర సర్కారుకు బాసటగా ట్విటర్లో స్పందించారు.

Anil Deshmukh statements
తారల ట్వీట్లపై దర్యాప్తు చేయనున్న మహారాష్ట్ర

By

Published : Feb 9, 2021, 7:31 AM IST

రైతులు చేస్తున్న ఉద్యమంపై ట్వీట్లు చేయాల్సిందిగా ఇటీవల కొందరు తారలపై ఒత్తిళ్లు వచ్చాయన్న ఆరోపణలపై నిఘా విభాగం దర్యాప్తు చేపట్టనుందని మహారాష్ట్ర హోం మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ తెలిపారు. ప్రముఖుల ట్వీట్ల వెనుక భాజపా ప్రమేయం ఉందంటూ కాంగ్రెస్‌ చేస్తున్న ఆరోపణలపై సోమవారం ఆయన స్పందించారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన సమావేశంలో కాంగ్రెస్‌ నేతలు చేసిన డిమాండ్లపై ఆయన సానుకూలంగా స్పందించారు.

క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌, ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్‌ వంటివారు ఇటీవలి కాలంలో కేంద్ర సర్కారుకు బాసటగా ట్విటర్లో స్పందించారు. ప్రముఖుల ట్వీట్లపై కాంగ్రెస్‌ నేతలు అభ్యంతరాలు తెలిపారని, బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌, బాలీవుడ్‌ ప్రముఖుడు అక్షయ్‌కుమార్‌ చేసిన ట్వీట్లు కూడా ఈ కోవలోకి వస్తాయని చెప్పారు. క్రీడాకారులు, సినీతారలపై కేంద్రం ఒత్తిడి తెచ్చి ట్వీట్లు చేయిస్తోందని మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు నానా పటోలే ఆరోపించారు. యువత ఆరాధించే వ్యక్తులు ఈ పని చేయవద్దని విజ్ఞప్తి చేశారు. గతంలో అధోజగత్తు నేతలు కొన్ని విషయాల్లో ఇలాంటి ఒత్తిళ్లు చేసేవారని చెప్పారు.

ఇదీ చదవండి:'రైతులను ప్రధాని మోసగించారు'

ABOUT THE AUTHOR

...view details