ఆర్టికల్ 370 రద్దు అనంతరం దేశంలో ఉగ్రదాడులు చేసేందుకు పాక్ ఆధారిత జైషే మహ్మద్ ఉగ్రసంస్థ కుట్ర పన్నుతోంది. తాజాగా జమ్ముకశ్మీర్ సహా చుట్టుపక్కల ప్రాంతాల్లోని వాయుసేన స్థావరాలే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులు చేయాలని ప్రణాళికలు రచించినట్లు తెలిసింది. జైషే మహ్మద్ ఉగ్రమూకకు చెందిన 8-10మందితో కూడిన ముష్కర బృందం... ఆత్మాహుతి దాడికి పాల్పడే ప్రమాదముందని నిఘా వర్గాలు హెచ్చరించాయి.
భారత వాయుసేన స్థావరాలపై దాడులకు పాక్ కుట్ర! - Jaish-e-Mohammed (JeM) terrorists
భారత వాయుసేన స్థావరాలపై దాడులకు పాక్ కుట్ర!
09:35 September 25
వాయుసేన స్థావరాలపై దాడులకు ఉగ్రకుట్ర!
హై అలర్ట్
నిఘా సమాచారంతో అధికారులు భద్రతను ఎక్కడికక్కడ కట్టుదిట్టం చేశారు. శ్రీనగర్, అవంతిపొర, జమ్ము, పఠాన్కోట్, హిండన్ ప్రాంతాల్లోని వాయుసేన స్థావరాలను అప్రమత్తం చేశారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు సీనియర్ అధికారులు 24 గంటలు భద్రతను సమీక్షిస్తున్నారు.
ఇదీ చూడండి : 'గ్లోబల్ గోల్ కీపర్' పురస్కారం స్వీకరించిన మోదీ
Last Updated : Oct 1, 2019, 10:41 PM IST