తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అయోధ్యకు ఉగ్రదాడుల ముప్పు- భద్రత కట్టుదిట్టం - అయోధ్యలో ఉగ్రవాదులు

అయోధ్యకు ఉగ్రదాడుల ముప్పు పొంచి ఉన్నందున ఉత్తర్​ ప్రదేశ్​ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. జైషే మహ్మద్​ అధినేత మసూద్ అజార్​ ఈ దాడికి పిలుపునిచ్చినట్లు నిఘా​ వర్గాల నుంచి సమాచారం అందింది.

Intel flags 'possible' terror strikes in Ayodhya
అయోధ్యకు ఉగ్రదాడుల ముప్పు- భద్రత కట్టుదిట్టం

By

Published : Dec 25, 2019, 5:08 PM IST

Updated : Dec 25, 2019, 6:55 PM IST

అయోధ్యలో ఉగ్రదాడి జరిగే ప్రమాదం ఉందన్న సమాచారంతో ఉత్తర్​ ప్రదేశ్​ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అయోధ్య అంతటా దాడులు చేయాలని పాకిస్థాన్​ కేంద్రంగా పనిచేసే జైషే మహ్మద్​ ఉగ్రసంస్థ అధినేత​ మసూద్​ అజార్​ పిలుపునిచ్చినట్లు నిఘా​ వర్గాల నుంచి సమాచారం అందింది.

అయోధ్య భూవివాదం కేసులో సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా నాలుగు నెలల్లోనే రామ మందిరాన్ని నిర్మిస్తామని ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్​ షా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాద సంస్థల నుంచి హెచ్చరికలు వచ్చాయి. భారత్​లో దాడులు చేయాలని సామాజిక మాధ్యమం టెలిగ్రామ్​ ద్వారా ఉగ్రవాదులను అజార్​ కోరిన ఓ వీడియో ఇటీవల బయటకొచ్చింది.

ఏడుగురు ఎక్కడ?

గత నెలలో భారత్​- నేపాల్​ సరిహద్దు వెంబడి పాకిస్థాన్​కు చెందిన ఏడుగురు ఉగ్రవాదులు భారత్​లోకి చొరబడినట్లు సమాచారం అందినప్పటి నుంచి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఉత్తర్​ ప్రదేశ్​లోని గోరఖ్​పుర్​, అయోధ్య నగరాల్లో తీవ్రవాదులు తల దాచుకుంటున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. వారి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.

ఇదీ చూడండి: 'రెండేళ్ల క్రితం నా భర్తను హత్య చేశాను.. శిక్షించండి'

Last Updated : Dec 25, 2019, 6:55 PM IST

ABOUT THE AUTHOR

...view details