జమ్ముకశ్మీర్‌లో దాడులు చేయడానికి పాక్ ఆధారిత ఉగ్రసంస్థలు కుట్ర పన్నాయన్న నిఘా సమాచారం మేరకే అదనపు భద్రతా బలగాలు మోహరించామని కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టంచేశాయి. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించాయి. 'ఆర్టికల్ 35 ఏ రద్దు' చేస్తారనే వదంతలు సహా జమ్ముకశ్మీర్‌లోని వివిధ రాజకీయ పార్టీలు భద్రతా బలగాల మోహరింపుపై ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ప్రభుత్వ వర్గాలు ఈ ప్రకటన చేశాయి.
డోభాల్ పర్యటనతో.... రగడ మొదలు
జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ మూడు రోజుల పర్యటనలో జమ్ముకశ్మీర్‌లోని పోలీసులు, పారామిలటరీ, సైనికి, పౌర అధికారులతో విస్తృత చర్చలు జరిపారు. నిఘా సంస్థలతోనూ సమాలోచనలు చేశారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో తలెత్తే పరిస్థితులను ఎదుర్కోవడానికి అత్యవసర ప్రణాళికను ఉన్నతాధికారులు సిద్ధం చేశారు.
భద్రతాదళాల మోహరింపు
అజిత్ డోభాల్ పర్యటించి వచ్చాక.. జమ్ముకశ్మీర్‌లో భద్రతను కట్టుదిట్టం చేయడానికి భద్రతా సిబ్బందిని తరలించాలని కేంద్రం నిర్ణయించింది. కేంద్ర సాయుధ పోలీసు బలగాల నుంచి 100 కంపెనీలను తక్షణం అక్కడకు పంపాలని ఆదేశించింది.
పటిష్ట బందోబస్తు
కేంద్రం ఆదేశం మేరకు జమ్ముకశ్మీర్‌లోని విమానాశ్రయాలు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, విద్యుత్ గ్రిడ్లు నీటి సరఫరా, ఆసుపత్రులు, భద్రతా శిబిరాల వద్ద బలగాలను మోహరిస్తున్నారు. అల్లర్లను సృష్టించే అవకాశమున్న వారి పేర్లుతో జాబితా సిద్ధం చేస్తున్నారు. జాతి వ్యతిరేక శక్తులను ముందుగానే అదుపులోకి తీసుకునేందుకు అవకాశముందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
కశ్మీర్లో ఉగ్రవాద నిరోధక చర్యలు, శాంతి భద్రతలను పటిష్టం చేయటానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఆర్టికల్ 35ఏ రద్దుకేనని విమర్శలు