దిల్లీ అల్లర్లకు సంబంధించి భయానక వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. రాళ్లు, కర్రలు, రాడ్లు, మందు సీసాలు.. ఇలా చేతికందిన వాటిని ఆయుధాలుగా చేసుకుని రెచ్చిపోయారు నిరసనకారులు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా కనపడిన వారిపై దాడికి తెగబడ్డారు.
ఓ కారు డ్రైవర్పైనా ఇదే విధంగా విరుచుకుపడ్డారు నిరసనకారులు. ఏం జరుగుతుందో అర్థమయ్యే సరికి ఆ వృద్ధుడి తలపై బలమైన గాయాలయ్యాయి.
"నేను నా కారులో భోపురకు వెళ్తున్నా. అశోక్ నగర్లోని బల్లి ఫట్టి మార్కెట్ వద్ద నాపై ఒక్కసారిగా 25మంది దాడి చేశారు. రాడ్లు,కర్రలతో కొట్టారు."