కర్ణాటకలో వరద బాధితులకు సాయం అందించేందుకు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ సుధా మూర్తి ముందుకొచ్చారు. బెంగళూరు జయనగర్లోని ఆమె నివాసంలో స్వయంగా సహాయ సామగ్రిని పంపిణీ కోసం సిద్ధం చేశారు.
వరదల కారణంగా నిరాశ్రయులైన వారికి ఇళ్లు కట్టించేందుకు నిర్ణయం తీసుకున్నారు సుధా మూర్తి. ఇందుకోసం ఇన్ఫోసిస్ ఫౌండేషన్ నుంచి రూ.10 కోట్లు కేటాయించనున్నారు.