తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ప్రజాస్వామ్య దేశంలో నియంతృత్వ పోకడ' - సోనియా గాంధీ

దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలను నాశనం చేస్తున్నారని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆరోపించారు. ప్రజాస్వామ్య దేశంలో నియంతృత్వం పెరిగి పోతోందని, ద్వేషం, హింసతోపాటు విషాన్ని వ్యాప్తి చేస్తున్నారని మండిపడ్డారు.

GC SONIA
సోనియా గాంధీ

By

Published : Aug 29, 2020, 4:41 PM IST

దేశ వ్యతిరేక, పేదల వ్యతిరేక శక్తులు ద్వేషం, హింసతో పాటు విషాన్ని వ్యాప్తి చేస్తున్నాయని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆరోపించారు. ప్రజాస్వామ్య దేశంలో నియంతృత్వం పెరుగుతోందని చెప్పారు.

ఛత్తీస్​గఢ్​ నయా రాయపుర్​లో నిర్మించే అసెంబ్లీ భవన శంకుస్థాపన కార్యక్రమాన్ని ఉద్దేశించి విడుదల చేసిన వీడియో సందేశంలో సోనియా విమర్శలు గుప్పించారు. ఎవరి పేరును ప్రస్తావించని సోనియా.. దేశంలో ప్రజల గళాన్ని అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

"కొంత కాలంగా ఓ ప్రయత్నం జరుగుతోంది. ప్రజలు ఒకరిపై ఒకరు పోరాడుతున్నారు. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా భావప్రకటన హక్కు ప్రమాదంలో పడింది. ప్రజాస్వామ్య సంస్థలను నాశనం చేస్తున్నారు. ప్రస్తుతం చెడు ఆలోచన అధిపత్యాన్ని చెలాయిస్తోంది. ప్రజాస్వామ్యం పునాదిని రక్షించుకోవడానికి అందరూ ప్రతిజ్ఞ చేయాలి. "

- సోనియా గాంధీ

రాజ్యాంగం భవనాల పునాదుల మీద నిలబడదని, భావోద్వేగాల ద్వారా రక్షించుకోవాలని అన్నారు సోనియా. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా ఛత్తీస్​గఢ్​ సీఎం భూపేశ్ బఘేల్, స్పీకర్ చరణ్ దాస్ మహంత్, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:'లేఖలో నాయకత్వ మార్పును కోరలేదు'

ABOUT THE AUTHOR

...view details