భారత సైన్యం సరిహద్దులో చేపట్టిన పటిష్ఠమైన చర్యల కారణంగా జమ్ముకశ్మీర్లోకి నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాదుల చొరబాట్లు గణనీయంగా తగ్గినట్లు భారత సైన్యం కమాండర్ బీఎస్ రాజు తెలిపారు. బలగాలు తీవ్రంగా శ్రమించినందు వల్లే ఇది సాధ్యమైందన్నారు. అదనపు నిఘా, చిన్న, పెద్ద సైజు డ్రోన్ల వినియోగం, సాంకేతికత, క్షేత్రస్థాయిలో బలగాల మోహరింపుతో పాకిస్థాన్ ముష్కరుల చొరబాట్లను నిలువరించినట్లు చెప్పారు.
పాకిస్థాన్, భారత్‌ల సరిహద్దు ప్రాంతం కశ్మీర్లోని నియంత్రణ రేఖ వెంబడి గతేడాది 130 సార్లు చొరబాటు ఘటనలు జరిగితే ఈ ఏడాది ఇప్పటి వరకు కేవలం 27 ఘటనలే జరిగినట్లు బీఎస్ రాజు వివరించారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నట్లు పేర్కొన్నారు.