తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'జల చర్చల' వేదికపై భారత్​- పాక్​ తలో మాట

భారత్​-పాకిస్థాన్​ మధ్య నెలకొన్న జల వివాదంపై చర్చించేందుకు ఇరు దేశాల​కు ఏకాభిప్రాయం కుదరడం లేదు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఆన్​లైన్​లో చర్చలు జరుపుదామని భారత్​ కోరగా.. అట్టారీ సరిహద్దు చెక్​పోస్టు వద్ద సమావేశం కావాల్సిందేనని పాకిస్థాన్​ పట్టుబడుతోంది.

Indus Water Treaty meeting: India suggests video-conf, Pak insists on meeting on Wagah border
'జల వివాదం' చర్చల వేదికపై భారత్​- పాక్​ తలో మాట

By

Published : Aug 10, 2020, 5:46 AM IST

భారత్​- పాకిస్థాన్​ మధ్య సుదీర్ఘకాలంగా సాగుతున్న జల వివాదం ఇప్పట్లో పరిష్కారమయ్యేలా కనిపించడం లేదు. వివాదం తెరదించేందుకు చేపట్టాల్సిన చర్చల వేదికపై ఇరు దేశాల మధ్య నెలకొన్న భేదాభిప్రాయాలు ఇందుకు కారణం. కరోనా వైరస్​ విజృంభిస్తున్న తరుణంలో ఆన్​లైన్​లో చర్చలు జరపాలని భారత్​ చెబుతుండగా.. అట్టారీ చెక్​పోస్టు వద్ద సమావేశమవుదామని పాక్​ పట్టుబడుతోంది.

నిజానికి పాకిస్థాన్​ అభ్యర్థన మేరకు ఈ ఏడాది మార్చిలో ఇరు దేశాలు భేటీకావాల్సి ఉంది. కానీ కరోనా నేపథ్యంలో సమవేశం వాయిదా పడింది.

కరోనా నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణాలు వీలుకాకపోవడం వల్ల.. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా సమావేశం నిర్వహించాలని జులై మొదటి వారంలో భారత కమిషనర్​ పాక్​ను కోరారు. వర్చువల్​ విధానాల్లో జరుగుతున్న అంతర్జాతీయ సమావేశాలను ఇందుకు ఉదాహరణగా చూపించారు. జులై చివరి వారంలో పాక్​ బదులిచ్చింది. ఆన్​లైన్​ వద్దని.. అట్టారీ సరిహద్దు చెక్​పోస్ట్​ వద్ద భేటీ అవుదామని పాక్​కమిషనర్​ ప్రతిపాదించారు.

కిషెన్​గంగా, రాట్లె హైడ్రో విద్యుత్​ ప్రాజెక్టుల అంశంలో ప్రస్తుతం ఇరు దేశాల మధ్య సమస్యలు ఉన్నాయి.

ఇదీ చూడండి:-'భారత్​- పాక్ జల వివాదంపై ఏ నిర్ణయం తీసుకోలేం!'

ABOUT THE AUTHOR

...view details