ఓ ప్రముఖ బీమా సంస్థరూ. కోటి 22 లక్షల పరిహారం చెల్లించాలని మధ్యప్రదేశ్ ఇండోర్ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఇంత భారీ మొత్తంలో బీమా చెల్లింపునకు న్యాయస్థానం ఆదేశం ఇవ్వడం రాష్ట్రంలో ఇదే తొలిసారి.
కోర్టు సంచలన తీర్పు- రూ.1.22 కోట్లు చెల్లించాలని ఆదేశం - Justice Ramesh Ranjan Choubey of Indore court
ముంబయి కేంద్రంగా పనిచేసే ఓ బీమా సంస్థ.. కోటి 22 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని ఇండోర్ జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఇంత భారీ మొత్తంలో బీమా చెల్లింపునకు న్యాయస్థానం ఆదేశం ఇవ్వడం రాష్ట్రంలో ఇదే తొలిసారి.
![కోర్టు సంచలన తీర్పు- రూ.1.22 కోట్లు చెల్లించాలని ఆదేశం Indore court to orders to pay Rs 1.22 cr compensation to accident victim's kin](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9142746-thumbnail-3x2-indore.jpg)
బాధిత కుటుంబానికి 1.22 కోట్లు చెల్లించాలన్న ఇండోర్ కోర్టు
మధ్యప్రదేశ్ విద్యుత్ శాఖలో జూనియర్ ఇంజినీర్‌గా పనిచేసే జై సమీర్ ఎక్కా 2018లో రోడ్డు ప్రమాదంలో మరణించారు. అతనిపై ఉన్న బీమాని పొందేందుకు కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం బీమా కంపెనీ ఈ మేరకు చెల్లించాలని తీర్పు ఇచ్చింది.
Last Updated : Oct 12, 2020, 12:26 PM IST