సరిహద్దు ఘర్షణతో భారత-చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో జాతీయ ప్రయోజనాలే ముఖ్యమన్న రామ మందిర్ ట్రస్ట్.. అయోధ్యలో మందిర నిర్మాణ పనులను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. సరిహద్దు ఘర్షణలో 20 మంది సైనికులు అమరులైన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త తేదీలను త్వరలోనే వెల్లడిస్తామని ట్రస్ట్ స్పష్టం చేసింది.
సరిహద్దు ఉద్రిక్తతలతో రామ మందిర నిర్మాణం వాయిదా - అయోధ్య రామ మందిరం
భారత్-చైనా సరిహద్దులో ప్రతిష్టంభన కారణంగా అయోధ్యలోని రామ మందిర నిర్మాణ పనుల ప్రారంభాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ట్రస్ట్ సభ్యులు ప్రకటించారు. కొత్త తేదిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
![సరిహద్దు ఉద్రిక్తతలతో రామ మందిర నిర్మాణం వాయిదా Indo-China border standoff: Plan to start construction of Ram Temple in Ayodhya suspended](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7680768-thumbnail-3x2-ramamandir.jpg)
సరిహద్దు ఉద్రిక్తతలతో రామ మందిర నిర్మాణం వాయిదా
భారత సైనికుల మరణం పట్ల ఆందోళన వ్యక్తం చేసిన ట్రస్ట్ సభ్యులు.. అమర జవాన్లకు నివాళులు అర్పించారు. దేశంలోని పరిస్థితులకు అనుగుణంగా మందిర పనుల ప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు సభ్యుడు అనిల్ మిశ్రా.
ఇదీ చూడండి:గల్వాన్ ఘటనలో 76 మంది సైనికులకు గాయాలు?