అసోంలోని బోడోల్యాండ్ టెరిటోరియల్ కౌన్సిల్‌కు మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న వేళ.. చిరాంగ్‌లో బయటపడిన భారీ ఆయుధాల డంప్ కలకలం రేపింది. అసోం పోలీసులు, భారత సైన్యం జరిపిన ఈ సంయుక్త ఆపరేషన్‌లో బయటపడిన ఈ డంప్‌లో 7 పిస్టళ్లు, 3 రివాల్వర్లు, 192 గ్రెనేడ్లు, 200 రౌండ్ల ఏకే 47 తుపాకి తూటాలు, 85 ఎస్ఎల్ఆర్ మ్యాగజైన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు అసోం ఎస్పీ సుధాకర్ సింగ్ ప్రకటన విడుదల చేశారు. ఆయుధాల డంప్‌పై విశ్వసనీయ వర్గాల నుంచి వచ్చిన కచ్చితమైన సమాచారాన్ని అనుసరించే ఈ ఆపరేషన్ చేపట్టినట్లు పేర్కొన్నారు.
12 రోజులపాటు..