తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆసక్తి : భాజపాపై శివసేన పరోక్ష విమర్శలు! - bjp-shivasena latest update

భాజపా-శివసేన కూటమి మహారాష్ట్ర ఎన్నికల్లో అఖండ విజయం సాధించింది. మిత్రపక్షంపై ఎప్పటి నుంచో గుర్రుగా ఉన్న శివసేన తాజాగా పరోక్ష విమర్శలు చేసింది. అధికారం అనే అహంకారంతో వ్యవహరించే వారికి ఈ ఫలితాలు చెంపపెట్టు అని వ్యాఖ్యానించింది.

'అధికార అహంకారులకు ఈ ఫలితాలు చెంపపెట్టు'

By

Published : Oct 25, 2019, 12:27 PM IST

Updated : Oct 25, 2019, 1:59 PM IST

భాజపాపై శివసేన పరోక్ష విమర్శలు

మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో మిత్రపక్షం భాజపాతో కలిసి పోటీ చేసి విజయం సాధించింది శివసేన. అయితే.. భాజపాపై పరోక్ష విమర్శలు గుప్పిస్తూ.. ఎన్నికల ఫలితాలపై పార్టీ పత్రిక సామ్నాలో వ్యాసం రాసింది.

అధికారం అనే అహంకారంతో వ్యవహరించే వారికి ఈ ఫలితాలు చెంపపెట్టు లాంటివని వ్యాఖ్యానించింది శివసేన. ఫిరాయింపులు, విపక్ష పార్టీల చీలికలను ప్రజలు తిరస్కరించారని పేర్కొంది. రాజకీయాల్లో ప్రత్యర్థులను అంతం చేయలేరు అనే విషయాన్ని ఈ ఫలితాలు నిరూపించాయని తెలిపింది. ఎన్సీపీని దెబ్బతీసేందుకు భాజపా చేసిన ప్రయత్నాలను చూసి ఆ పార్టీకి భవిష్యత్తు ఉంటుందా అని ప్రజలు ఆశ్చర్యపోయారని తెలిపింది.

ఫడణవీస్​ యాత్రపైనా..

ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ చేపట్టిన మహా జనాదేశ్‌ యాత్రపైనా వ్యంగ్యాస్త్రాలు గుప్పించింది సేనా. ప్రజలు మహా తీర్పు ఇవ్వలేదని తెలిపింది. ముఖ్యమంత్రి పదవీకాలాన్ని సగం సగం పంచుకోవాలని డిమాండ్‌ చేస్తున్న శివసేన తాజాగా చేసిన విమర్శలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

ఇదీ చూడండి:'భాజపాతో కలిస్తే.. స్వతంత్రులపై పాదరక్షల వర్షమే'

Last Updated : Oct 25, 2019, 1:59 PM IST

ABOUT THE AUTHOR

...view details