కరోనా కాలంలోనూ వైరస్ నిబంధనలను పాటిస్తూ విమానాశ్రయాలు సేవలందిస్తున్నాయి. అయితే ఇలాంటి మహమ్మారితో ప్రజలు ఇబ్బందులు పడకుండా మరింత చర్యలు తీసుకుంటోంది దిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా సురక్షితమైన ఎయిర్‌పోర్టుల జాబితాలో రెండోస్థానం సాధించింది.
దాదాపు 200 విమానాశ్రయాల్లోని కరోనా జాగ్రత్తలు, భద్రతా ప్రమాణాల అమలును పరిశీలించింది విడెస్ సంస్థకు చెందిన 'సేఫ్ ట్రావెల్ బారోమీటర్'. తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో సింగపూర్‌లోని చంగీ ఎయిర్‌పోర్టు తొలి ర్యాంక్ సొంతం చేసుకోగా.. జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ విమానాశ్రయం, చైనాలోని చెంగుడు అంతర్జాతీయ విమానాశ్రయం దిల్లీతో కలిసి రెండో స్థానాన్ని పంచుకున్నాయి. కరోనా సమయంలో ప్రయాణికుల ఆరోగ్యం, భద్రతా విషయంలో ఇవి ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.
ప్రయాణికుల ఆరోగ్యం, భద్రతాపరమైన నిబంధనలను పర్యవేక్షించడానికి.. ప్రపంచంలోనే అతిపెద్ద, సమగ్రమైన సాధనాల్లో సేఫ్ ట్రావెల్ బారోమీటర్ను కీలకంగా వ్యవహరిస్తారు.