ఇండిగో విమానం ఆదివారం పెను ప్రమాదం నుంచి బయటపడింది. సూరత్ నుంచి కోల్కతా పయనమైన ఈ విమానం.. మధ్యప్రదేశ్లోని భోపాల్లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్లే విమాన దారిని మళ్లించి మధ్యలో ల్యాండ్ చేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. ఆ సమయంలో విమానంలో 172 మంది ప్రయాణికులు ఉండటం గమనార్హం.
ఇండిగో విమానానికి తప్పిన పెనుముప్పు - విమానానికి తప్పిన ముప్పు
సూరత్ నుంచి కోల్కతాకు 172 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఓ విమానం.. భోపాల్లో అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు.
ఇండిగో విమానానికి తప్పిన పెనుముప్పు!
ఈ సంఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. సురక్షితంగా భోపాల్లో విమానం ల్యాండ్ అయినట్లు చెప్పారు.
ఇదీ చూడండి:హవాలా రాకెట్: ఈడీ కస్టడీకి ఇద్దరు చైనీయులు