భారత వాయుసేనలోని పాత తరం కిరణ్ యుద్ధ విమానాల శ్రేణిని ఇంటర్మీడియేట్ జెట్ ట్రైనర్(ఐజేటీ) జెట్లు భర్తీ చేయనున్నాయి. వీటిని హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించింది.
కిరణ్ యుద్ధ విమానాల స్థానంలో స్వదేశీ జెట్లు
భారత వాయుసేన అమ్ములపొదిలోకి త్వరలో ఇంటర్మీడియేట్ జెట్ ట్రైనర్(ఐజేటీ) చేరబోతున్నాయి. పాత తరం కిరణ్ యుద్ధ విమానాల స్థానాన్ని ఈ జెట్లు భర్తీ చేయనున్నాయి. ఐజెటీలను పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో హెచ్ఏఎల్ రూపొందించింది.
ఐజెటీ జెట్
ఇందుకు సంబంధించి బెంగళూరులో స్పిన్ ఫ్లైట్ పరీక్షను నిర్వహిస్తోంది. ఈ మేరకు హెచ్ఏఎల్ టెస్ట్ పైలట్స్ బృందం కెప్టెన్ హెచ్వీ ఠాకూర్, వింగ్ కమాండర్ పీ అవస్థి వెల్లడించారు.