తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా పంజా: 'మహా'లో 24 వేలు దాటిన మరణాలు - covid cases in tn

దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తోంది. కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తమిళనాడులో తాజాగా ​6,352 కేసులు నమోదయ్యాయి. యూపీలో 5,684, కర్ణాటకలో 8,324 మంది కరోనా బారినపడ్డట్లు తేలింది. గుజరాత్​లో రికార్డు స్థాయిలో కేసులు బయటపడ్డాయి. మహారాష్ట్రలో కరోనా మరణాల సంఖ్య 24 వేలు దాటింది.

India's trajectory of daily COVID-19 cases highest-ever globally
కరోనా పంజా: మహారాష్ట్రలో 24 వేలు దాటిన మరణాలు

By

Published : Aug 29, 2020, 8:35 PM IST

దేశంలో కరోనా రక్కసి కోరలు చాస్తోంది. ప్రపంచంలో అత్యధిక రోజువారీ కేసులు భారత్​లోనే నమోదవుతున్నాయి. పలు రాష్ట్రాలు ఈ మహమ్మారి ధాటికి విలవిల్లాడుతున్నాయి. పట్టణాల్లోనూ కేసులు పెరుగుతుండటం కలవరం కలిగిస్తోంది.

మహా విధ్వంసం

దేశంలో కరోనాకు కేంద్ర బిందువుగా ఉన్న మహారాష్ట్రలో వైరస్ ఉగ్రతాండవం చేస్తోంది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 16,867 మంది కరోనా బారినపడ్డట్లు మహారాష్ట్ర వైద్య శాఖ వెల్లడించింది. మరో 328 మంది వైరస్​తో ప్రాణాలు కోల్పోయారు. దీంతో కరోనా మరణాల సంఖ్య 24,103కి చేరింది.

ఎనిమిదివేలు

కర్ణాటకలో కరోనావైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఇవాళ 8,324 మందికి కరోనా పాజిటివ్​గా తేలగా... మొత్తం బాధితుల సంఖ్య 3,27,076కి పెరిగింది. 115 మంది మరణంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 5,483కి పెరిగింది.

6 వేలకు పైగా

తమిళనాడులో వైరస్ విలయతాండవం చేస్తోంది. కొత్తగా 6,352 కేసులు నమోదయ్యాయి. 87 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో వైరస్ కేసుల సంఖ్య 4,15,590కి చేరింది. మృతుల సంఖ్య 7,137కి ఎగబాకింది. 3,55,727 మంది కరోనా నుంచి కోలుకోగా.. 52,726 యాక్టివ్ కేసులు ఉన్నాయి. చెన్నైలో కొత్తగా 1,285 కేసులు బయటపడ్డాయి.

2.19 లక్షల బాధితులు

ఉత్తర్​ప్రదేశ్​లో కొత్తగా 62 మంది కరోనాకు బలయ్యారు. దీంతో రాష్ట్రంలో మరణాల సంఖ్య 3,356కి పెరిగింది. మరోవైపు మరో 5,684 మంది కొత్తగా వైరస్ బారినపడ్డారు. వీరితో కలిపి మొత్తం బాధితుల సంఖ్య 2.19 లక్షలకు చేరింది.

కేరళ..

కేరళలో 2,397 కేసులు వెలుగులోకి వచ్చినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ పేర్కొన్నారు. ప్రస్తుతం 23,277 యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలిపారు.

దిల్లీ

దేశ రాజధానిలో కరోనా విలయం తగ్గినప్పటికీ.. కొత్త కేసులు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. మరో 1,945 మందికి మహమ్మారి సోకినట్లు దిల్లీ వైద్య శాఖ వెల్లడించింది. 15 మంది మరణించారు. ఫలితంగా మొత్తం కేసులు 1,71,366కి చేరగా.. మృతుల సంఖ్య 4,404కి పెరిగింది. 1,52,922 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 14,040 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఒకరోజు రికార్డు!

గుజరాత్​లో 1,282 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. ఒక రోజు వ్యవధిలో ఆ రాష్ట్రంలో నమోదైన అత్యధిక కేసులు ఇవే కావడం గమనార్హం. దీంతో మొత్తం కేసులు 93,883కి చేరుకున్నాయి. 13మంది మృతి చెందగా... మొత్తం మరణాల సంఖ్య 2,991కి పెరిగింది.

ఇదీ చదవండి-ఏడు రాష్ట్రాల్లోనే 81 శాతం కరోనా మరణాలు

ABOUT THE AUTHOR

...view details