తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో 872కు పెరిగిన కరోనా మరణాలు - కొవిడ్​ వైరస్​

24 గంటల వ్యవధిలోనే దేశంలో 48 కరోనా మరణాలు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 20 వేల 835 యాక్టివ్​ కేసులు ఉన్నట్లు ప్రకటించిన కేంద్రం.. దేశంలో మొత్తం మరణాలు సంఖ్యను 872కు పెరిగినట్లు వివరించింది.

India's total number of #Coronavirus positive cases rise to 27,892
దేశంలో 872కు పెరిగిన కరోనా మరణాలు

By

Published : Apr 27, 2020, 9:27 AM IST

దేశంలో కరోనా మరణాలు 872కు పెరిగాయి. 24 గంటల వ్యవధిలోనే 1396 కొత్త కేసులు, 48 మరణాలు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొవిడ్​ కేసులు 27 వేల 892కు చేరాయి. మొత్తం 6,185 మంది కోలుకోగా.. 20 వేల 835 యాక్టివ్​ కేసులున్నాయి.

భారత్​లో కొవిడ్​ వివరాలు

భారత్​లో వైరస్​కు కేంద్ర బిందువుగా ఉన్న మహారాష్ట్రలో అత్యధికంగా 342 మంది కొవిడ్​కు బలయ్యారు. అక్కడ బాధితుల సంఖ్య 8068గా ఉంది. రాష్ట్రంలో 1076 మంది కోలుకున్నారు. గుజరాత్​లో కరోనా మృతుల సంఖ్య 151కి చేరింది. తమిళనాడులో రికార్డు స్థాయిలో 1020 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details