దేశంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ స్థిరంగా పెరుగుతోంది. తాజాగా 46,232 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 564 మంది మహమ్మారికి బలయ్యారు.
దేశంలో కొత్తగా 49,715 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రోజువారి కేసులతో పోలిస్తే కోలుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటం కాస్త ఊరట కలిగిస్తోంది.