తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో అత్యత్తుమ ఠాణాగా 'మణిపుర్​-నాంగ్​పోక్​షికమై'

దేశంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన టాప్​-10 పోలీస్​ స్టేషన్ల జాబితాలో తొలిర్యాంకును కైవసం చేసుకుంది మణిపుర్​ తౌబల్​ జిల్లాలోని నాంగ్​పోక్​షికమైన ఠాణా. ఆ తర్వాత తమిళనాడు, అరుణాచల్​ప్రదేశ్​లు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. టాప్​ టెన్​లో తెలంగాణకు చోటు లభించింది.

Top 10 Police Stations
కేంద్ర హోంశాఖ

By

Published : Dec 3, 2020, 12:47 PM IST

ఈ ఏడాది దేశంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన టాప్​-10 పోలీస్​ స్టేషన్ల జాబితాను విడుదల చేసింది కేంద్ర హోంశాఖ. అందులో తొలిస్థానంలో మణిపుర్​కు చెందిన నాంగ్​పోక్​షికమై ఠాణా నిలిచింది. తమిళనాడు సేలం జిల్లాలోని ఏడబ్ల్యూపీఎస్​-సురమంగళం స్టేషన్​ రెండో ర్యాంకును కైవసం చేసుకుంది.

పోలీసుల పనితీరును మెరుగుపరచటం, స్టేషన్ల మధ్య ఆరోగ్యకరమైన పోటీని తీసుకొచ్చేందుకే ఈ మేరకు ర్యాంకులు కేటాయిస్తున్నట్లు తెలిపింది హోంశాఖ.

టాప్​-10 పోలీస్​ స్టేషన్ల జాబితా..

ర్యాంక్ రాష్ట్రం జిల్లా పీఎస్​
1 మణిపుర్ తౌబల్​ నాంగ్​పోక్​షికమై
2 తమిళనాడు సేలం

ఏడబ్ల్యూపీఎస్​,

సురమంగళం

3 అరుణాచల్​ప్రదేశ్​ చాంగ్లాంగ్ ఖర్సాంగ్​
4 ఛత్తీస్​గఢ్ సూరజ్​పుర్

ఝిల్మిలి

(భాయా ఠాణా)

5 గోవా దక్షిణ గోవా సాంగుమ్ 6 అండమన్​, నికోబర్ ఉత్తర,మధ్య అండమన్​ కాలిఘట్ 7 సిక్కిం తూర్పు జిల్లా పక్యాంగ్​ 8 ఉత్తర్​ప్రదేశ్ మొరదాబాద్​ కాంత్​ 9 దాద్ర నగర్​ హవేలీ దాద్రా నగర్​ హవేలీ ఖాన్​వెల్​ 10 తెలంగాణ కరీంనగర్ జమ్మికుంట టౌన్

2015లో గుజరాత్​లోని కచ్​లో నిర్వహించి ఓ సభలో పోలీస్​ స్టేషన్ల పనితీరును మదింపు చేసి ర్యాంకులు కేటాయించాలని ప్రధాని మోదీ సూచించిన మేరకు.. అప్పటి నుంచి ప్రతిఏటా టాప్​-10 జాబితా విడుదల చేస్తోంది హోంశాఖ. ఈఏడాది కరోనా మహమ్మారి కారణంగా మారుమూల ప్రాంతాల్లోని పోలీస్​ స్టేషన్లకు వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డారు సర్వే నిర్వహించే అధికారులు. అయినప్పటికీ.. అన్ని నిబంధనలు పాటిస్తూ సర్వే పూర్తి చేసినట్లు తెలిపారు.

ఠాణాల వద్ద ఉన్న సమాచారం, ప్రజల అభిప్రాయాలు వంటివి పరిగణనలోకి తీసుకుని దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 16,671 పోలీస్​ స్టేషన్ల నుంచి టాప్​-10ను ఎంపిక చేశారు. మరో 75 ఠాణాలను తదుపరి ర్యాంకింగ్​ ప్రక్రియకు ఎంపిక చేశారు.

ఇదీ చూడండి: 'దివ్యాంగుల మెరుగైన జీవితం కోసం సమష్టిగా కృషి అవసరం'

ABOUT THE AUTHOR

...view details