తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశవ్యాప్తంగా 6 వేల కేసులు- 199 మరణాలు - కరోనా వైరస్​

భారత్​ను కరోనా వైరస్​ కలవరపెడుతోంది. కేసులతో పాటు మృతుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. కేవలం 12గంటల వ్యవధిలో 547 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం 6,412మంది వైరస్​ బారినపడ్డారు. 12 గంటల్లో 30మంది మరణించారు. ఫలితంగా మృతుల సంఖ్య 200కు చేరువైంది.

indias-tally-of-covid-19-cases-crosses-6000-mark-death-toll-at-199
దేశవ్యాప్తంగా 6 వేల కేసులు- 199 మరణాలు

By

Published : Apr 10, 2020, 9:41 AM IST

Updated : Apr 10, 2020, 4:39 PM IST

దేశంలో కరోనా వైరస్​ విజృంభిస్తోంది. 12 గంటల వ్యవధిలో 547 కొత్త కేసులు నమోదయ్యాయి, 30మంది ప్రాణాలు కోల్పోయారు.

దేశంలోని కేసులు
దేశంలో వైరస్​ విజృంభణ ఇలా...

మహారాష్ట్రలో...

మహారాష్ట్రలో వైరస్​ తీవ్రత ఆందోళనకరంగా ఉంది. ముంబయిలో తాజాగా 8 కేసులు నమోదయ్యాయి. వీటిలో 5 ధారావి, 3 దాదర్​ ప్రాంతాలకు చెందినవి. ఈ 8 మందిలో ఇద్దరు నర్సులు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,364మందికి వైరస్​ సోకింది.

జమ్ముకశ్మీర్​లో...

వైరస్​తో జమ్ముకశ్మీర్​లోని టిక్రి ప్రాంతానికి చెందిన ఓ మహిళ గురువారం ప్రాణాలు కోల్పోయింది. ఆమెను కలిసిన 12మందిని పోలీసులు తాజాగా గుర్తించారు. వీరిలో 10మందికి ఇప్పటికే కరోనా పరీక్షలు నిర్వహించగా.. నలుగురికి వైరస్​ సోకినట్టు నిర్ధరణ అయ్యింది.

అసోంలో...

అసోంలో తొలి కరోనా మరణం సంభవించింది. హైలకండి జిల్లాకు చెందిన 65ఏళ్ల వృద్ధుడు ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అతడు విశ్రాంత బీఎస్​ఎఫ్​ ఉద్యోగిగా అధికారులు గుర్తించారు. వృద్ధుడు దిల్లీలో జరిగిన తబ్లీగీ జమాత్​ మర్కజ్​కు హాజరైనట్టు వెల్లడించారు. అంతకుముందు.. మృతుడు సౌదీ అరేబియాలోనూ పర్యటించినట్టు వివరించారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 28 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి.

రాజస్థాన్​లో...

రాజస్థాన్​ రాజధాని జైపుర్​లోని ఎస్​ఎమ్​ఎస్​ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 65ఏళ్ల వృద్ధురాలు మృతిచెందింది. ఆ రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 8కి చేరింది.

రాజస్థాన్​లో మొత్తం 463కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో 168మంది జైపుర్​కు చెందినవారు ఉండటం గమనార్హం.

ఇదీ చూడండి:-లాక్​డౌన్​ కొనసాగించాలని 88% మంది ఓటు

Last Updated : Apr 10, 2020, 4:39 PM IST

ABOUT THE AUTHOR

...view details