దేశ సామర్థ్యం పెంపుతోపాటు ప్రపంచ శాంతి, ఆర్థిక స్థిరత్వానికి ఊతమివ్వాలన్నదే ఆత్మ నిర్భర భారత్ లక్ష్యమని ఉద్ఘాటించారు ప్రధాని నరేంద్రమోదీ. భారత్ స్వయం సమృద్ధి సాధిస్తే... హిందూ మహాసముద్ర ప్రాంతంలో భద్రత పటిష్ఠం అవుతుందని, చుట్టుపక్కల దేశాలకు ఆయుధాల సరఫరాదారుగా మారుతుందని వివరించారు.
ఆత్మనిర్భర్ రక్షణ పరిశ్రమల వెబినార్లో మాట్లాడిన మోదీ.. కొన్నేళ్లుగా మనకున్న వనరులు వినియోగించుకోవటంలో విఫలమయ్యాయని అన్నారు. భారతీయ రక్షణ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని వ్యాపారవేత్తలకు పిలుపునిచ్చారు.
"చాలా సంవత్సరాలుగా అతిపెద్ద రక్షణ దిగుమతిదారులలో భారత్ ఒకటి. స్వాతంత్య్రం తొలినాళ్లలో రక్షణ తయారీలో భారత్ గొప్ప సామర్ధ్యం కలిగి ఉంది. దేశంలో 100 ఏళ్ల క్రితమే రక్షణ ఉత్పత్తుల తయారీ వ్యవస్థను స్థాపించారు. దురదృష్టవశాత్తు ఈ అంశంపై అవసరమైన దృష్టిని సారించలేకపోయాం.