తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'దేశ భద్రత, ప్రజా సంక్షేమానికే తొలి ప్రాధాన్యం'

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వంలో దేశ భద్రత, ప్రజల సంక్షేమం ముఖ్య ప్రాధాన్యాంశాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్​ షా స్పష్టంచేశారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక మోదీకి కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్​ చేశారు.

By

Published : Jun 1, 2019, 5:17 PM IST

Updated : Jun 1, 2019, 6:16 PM IST

'దేశ భద్రత, ప్రజా సంక్షేమానికే తొలి ప్రాధాన్యం'

'దేశ భద్రత, ప్రజా సంక్షేమానికే తొలి ప్రాధాన్యం'

రెండోసారి అధికారం చేపట్టిన ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్ర హోంశాఖ మంత్రిగా అమిత్​ షాకు అవకాశం లభించింది. శనివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు షా. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్​ చేశారు.

" మోదీ ప్రభుత్వంలో దేశ భద్రత, ప్రజల సంక్షేమం ముఖ్య ప్రాధాన్యాంశాలు. మోదీ నాయకత్వంలో అన్ని ప్రాధాన్యాలను నెరవేర్చేందుకు నా శాయశక్తులా ప్రయత్నిస్తా. ఈ రోజు నేను భారత హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాను. నాపై విశ్వాసం ఉంచిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు."
- అమిత్​ షా, కేంద్ర హోంమంత్రి

.

'దేశ భద్రత, ప్రజా సంక్షేమానికే తొలి ప్రాధాన్యం'
సంయుక్త కార్యదర్శులతో సమావేశం...

హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి మంత్రిత్వ శాఖలోని సంయుక్త కార్యదర్శులతో సమావేశమయ్యారు అమిత్​ షా. శాఖకు సంబంధించిన కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు.

ఇదీ చూడండి:'ప్రధాన ప్రతిపక్ష హోదాపై కేంద్రానిదే నిర్ణయం'

Last Updated : Jun 1, 2019, 6:16 PM IST

ABOUT THE AUTHOR

...view details