దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. అయితే.. కొద్ది రోజులుగా కేసులు 90 వేల దిగువనే నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా గురువారం 81 వేల 484 కొత్త కేసులు వెలుగుచూశాయి. మరో 1095 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
భారత్లో లక్షకు చేరువైన కరోనా మరణాలు - 1,095 deaths reported in last 24 hours.
భారత్లో కరోనా కేసులు 63 లక్షల 94 వేల 69కి చేరాయి. గురువారం 81 వేలమందికి పైగా వైరస్ సోకింది. మరో 1095 మరణాలు సంభవించాయి. దేశంలో మొత్తం మృతుల సంఖ్య లక్షకు చేరువైంది.
భారత్లో కరోనా కేసుల వివరాలు
గురువారం 10 లక్షల 97 వేల 947 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. ఐసీఎంఆర్ లెక్కల ప్రకారం.. మొత్తం టెస్టుల సంఖ్య 7 కోట్ల 67 లక్షలు దాటింది.
Last Updated : Oct 2, 2020, 9:54 AM IST