దేశంలో మరో 78 వేల 524 కరోనా కేసులు.. 971 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 68 లక్షల మార్కు దాటాయి. ప్రస్తుతం 9 లక్షల 2 వేలకుపైగా యాక్టివ్ కేసులున్నాయి.
దేశంలో 68 లక్షలు దాటిన కరోనా కేసులు - HEALTH MINISTRY
భారత్లో కరోనా కేసులు మళ్లీ పెరిగిపోతున్నాయి. ఒక్కరోజు 78 వేల 524 కేసులు.. 971 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 68 లక్షలు దాటిపోయింది.
భారత్లో కరోనా కేసుల వివరాలు
భారత్లో కోలుకుంటున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటివరకు 58 లక్షల 27 వేల మంది ఆస్పత్రుల నుంచి డిశ్చారయ్యారు. రికవరీ రేటు 85.25 శాతానికి చేరింది. మరణాల రేటు 1.54 శాతానికి పడిపోయింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
బుధవారం రోజు 11 లక్షల 94 వేలకుపైగా కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. మొత్తం టెస్టుల సంఖ్య 8 కోట్ల 34 లక్షలు దాటింది.
Last Updated : Oct 8, 2020, 10:40 AM IST