తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​లో 47 లక్షలు దాటిన కరోనా కేసులు - Coronavirus death toll in India

దేశంలో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. మొత్తం కేసులు 47 లక్షలు దాటాయి. ఒక్కరోజే 94 వేల 372 మంది వైరస్​ బారిన పడ్డారు.

INDIA CASES
కరోనా పంజా

By

Published : Sep 13, 2020, 9:43 AM IST

Updated : Sep 13, 2020, 11:11 AM IST

గడిచిన కొన్ని రోజులుగా దేశంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ప్రపంచంలోనే రోజువారీగా నమోదవుతున్న కేసుల్లో భారత్​లోనే అత్యధికంగా వెలుగుచూస్తున్నాయి. కొత్తగా 94 వేల 372 మంది వైరస్​ బారినపడ్డారు. మొత్తం కేసుల సంఖ్య 47 లక్షల మార్కు దాటింది. మరో 1114 మంది ప్రాణాలు కోల్పోయారు.

భారత్​లో 47 లక్షలు దాటిన కరోనా కేసులు

పెరుగుతున్న పరీక్షలు...

రాష్ట్రాలవారిగా కరోనా కేసులు

కరోనా నిర్ధరణ పరీక్షలు భారీగా నిర్వహిస్తున్నారు. ఫలితంగానే దేశంలో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 5 కోట్ల 62 లక్షల మందికిపై కొవిడ్ టెస్టులు చేసినట్లు ఆరోగ్యశాఖ విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. శనివారం ఒక్కరోజే 10 లక్షల 71 వేల 702 నమూనాలను పరీక్షించారు.

కరోనా పరక్షల వివరాలు

గణనీయంగా రికవరీ...

దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 37 లక్షల మందికిపైగా కొవిడ్​ను జయించారు. ఫలితంగా రికవరీ రేటు 77.88 శాతానికి పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. మరణాల రేటు 1.65 శాతానికి తగ్గినట్లు వెల్లడించింది. మరో 20.47 శాతం మంది చికిత్స పొందుతున్నారు.

అత్యధికంగా కొవిడ్​ కేసులు నమోదవుతున్నరాష్ట్రాలు
రికవరీల వివరాలు

ఇదీ చూడండి:లైవ్​ వీడియో: వాహనాలపైకి దూసుకెళ్లిన లారీ

Last Updated : Sep 13, 2020, 11:11 AM IST

ABOUT THE AUTHOR

...view details