తెలంగాణ

telangana

ETV Bharat / bharat

10,100 పడకలతో దేశంలోనే అతిపెద్ద కరోనా కేర్​ సెంటర్​! - karnataka corona virus

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ... ఆసుపత్రుల్లో పడకలు దొరకక ఎందరో బాధితులు ఇక్కట్లు పడుతున్నారు. ఆ ఇబ్బంది కర్ణాటక ప్రజలు పడకూడదనే ఉద్దేశంతో.. ఏకంగా 10,100 పడకలతో కరోనా కేర్​ సెంటర్​ను ఏర్పాటు చేసింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. బెంగళూరులో సకల వసతులతో ఏర్పాటైన ఈ ప్రత్యేక ఆసుపత్రిని కేంద్రం ప్రశంసించింది.

Indias largest COVID care center with 10 100 beds in Bengaluru
10,100 పడకలతో దేశంలోనే అతి పెద్ద కరోనా కేర్​ సెంటర్​!

By

Published : Jul 13, 2020, 8:23 PM IST

బృహత్​ బెంగళూరు మహానగర పాలక సంస్థ అతిపెద్ద కరోనా కేర్​ సెంటర్​ను ప్రారంభించనుంది. దేశంలో ఎక్కడా లేనివిధంగా 10,100 పడకలతో ఏర్పాటైందీ చికిత్సాలయం.

10,100 పడకలతో అతిపెద్ద కరోనా కేర్​ సెంటర్​!

కర్ణాటకలో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. దీంతో, వైరస్​ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. అందులో భాగంగానే.. పదివేల కరోనా బాధితులకు ఒకేసారి వైద్యం అందించే విధంగా ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేసింది.

10,100 పడకలతో దేశంలోనే అతి పెద్ద కరోనా కేర్​ సెంటర్​!

సకల వసతుల కేంద్రం...

10,100 పడకలతో దేశంలోనే అతి పెద్ద కరోనా కేర్​ సెంటర్​!

తుమకూరు రోడ్​లోని బెంగళూరు ఇంటర్​నేషనల్​ ఎగ్జిబిషన్​ సెంటర్​లో(బీఐఈసీ) నిర్మించిన ఈ ప్రత్యేక చికిత్సాలయంలో.. సకల వసతులు ఉన్నాయి. వంద ఐసీయూ పడకలు.. ఫ్యాన్లు, టీవీలు, న్యూస్​ పేపర్లు​, మ్యాగజైన్​లు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. అంతే కాదు.. రోగ నిరోధక శక్తి పెంచే ఆహారాన్ని అక్కడే వండి రోగులకు అందించేందుకు విశాలమైన కిచెన్​ కూడా ఉంది.

10,100 పడకలతో దేశంలోనే అతి పెద్ద కరోనా కేర్​ సెంటర్​!
10,100 పడకలతో దేశంలోనే అతి పెద్ద కరోనా కేర్​ సెంటర్​!
10,100 పడకలతో దేశంలోనే అతి పెద్ద కరోనా కేర్​ సెంటర్​!
10,100 పడకలతో దేశంలోనే అతి పెద్ద కరోనా కేర్​ సెంటర్​!
10,100 పడకలతో దేశంలోనే అతి పెద్ద కరోనా కేర్​ సెంటర్​!

సీనియర్ ఐఏఎస్​ అధికారుల బృందం పర్యవేక్షణలో నిర్మితమైన ఈ ఆసుపత్రిని, కేంద్ర ప్రభుత్వం తరఫున ఓ అధికారుల బృందం సందర్శించింది. అధునాతన సాంకేతికతతో, అతి తక్కువ కాలంలో ఆసుపత్రిని నిర్మించినందుకు కర్ణాటక ప్రభుత్వాన్ని ప్రశంసించింది.

ముఖ్యమంత్రి బీఎస్​ యడియూరప్ప పలువురు క్యాబినేట్​ మంత్రులతో కలిసి ఈ ఆసుపత్రిని సందర్శించారు. అయితే, ఈ పదివేల పడకల ఆసుపత్రిలో చికిత్స పొందేందుకు, బెంగళూరువాసులకే ప్రథమ ప్రాధాన్యం ఇస్తామని.. ఆ తర్వాతే ఎవరికైనా.. అని ఆ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: లాక్​డౌన్​ భయంతో ఖాళీ అవుతున్న రాజధాని!

ABOUT THE AUTHOR

...view details