తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత దేశ మొట్టమొదటి ఓటరుకు అస్వస్థత! - first time voting in india

ఆయన భారత ప్రజాస్వామ్యానికి అసలు సిసలు ప్రతిరూపం. స్వాతంత్ర్యం వచ్చాక జరిగిన తొలి ఎన్నిక నుంచి ఇప్పటివరకు ప్రతిసారీ గర్వంగా ఓటు హక్కును వినియోగించుకున్న దేశ భక్తుడు. 2019లో ఎన్నికల సంఘం బ్రాండ్​ అంబాసిడర్​. ఎందరో యువ ఓటర్లకు స్ఫూర్తి. కానీ... ఇప్పుడాయన కష్టాల్లో ఉన్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు.

భారత దేశ మొట్టమొదటి ఓటరుకు అస్వస్థత!

By

Published : Oct 21, 2019, 3:48 PM IST


భారత దేశ ప్రథమ ఓటరు శ్యామ్ శరణ్ నేగి ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్నారు.

హిమాచల్​ప్రదేశ్ కిన్నోర్​​కు చెందిన 103 ఏళ్ల శ్యామ్.. మొట్టమొదటిసారి 1951,అక్టోబర్​ 25న​ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అప్పటి నుంచి లోక్​సభ, అసెంబ్లీ, పంచాయతీ రాజ్​ ఎన్నికల కలిపి మొత్తం 32 సార్లు ఓటేసి యువతరానికి ఆదర్శంగా నిలిచారు. అందుకే ఆయన భారతీయ ప్రజాస్వామ్య 'లివింగ్ లెజెండ్'గా పేరొందారు.

ఇప్పుడు మర్చిపోయారు

ఎన్నికల సంఘం కోరిక మేరకు 2019 లోక్​సభ ఎన్నికలకు ​ బ్రాండ్​ అంబాసిడర్​గా వ్యవహరించారు శ్యామ్. అయితే, ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రభుత్వం, ఎన్నికల సంఘం ఆయన్ను మరచిపోయాయని వాపోయారు.

ఎంతో ఉత్సాహంగా యువ ఓటర్లకు స్ఫూర్తినిస్తూ, నిత్యం నవ్వుతూ ఉండే శ్యాం ఇప్పుడు డీలా పడిపోయారు. ఆసుపత్రికి వెళ్లి చూపించుకుందామన్నా.. కంటి చూపు మసకబారిపోయింది, తీసుకువెళ్లేవారూ లేరు.

"ఈ వయసులో, మోకాళ్ల నొప్పుల కారణంగా నేను నడవడానికి ఇబ్బంది పడుతున్నాను. నా దృష్టి, వినికిడి సామర్థ్యం కూడా రోజురోజుకీ తగ్గిపోతోంది" అని బాధ పడుతున్నారు ఈ ఆదర్శ పౌరుడు.

అధికారులు అప్పుడప్పుడు వైద్యులను పంపించేవారని, ఇప్పుడు వారు కూడా రావట్లేదని విలపిస్తున్నారు నేగి.

ఇదీ చూడండి:102 ఏళ్ల వయసులో మళ్లీ సిద్ధం

ABOUT THE AUTHOR

...view details