తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రపంచ కార్మిక ఉద్యమ చరిత్రపై మ్యూజియం - కేరళ తాాజా వార్తలు

దేశంలోనే తొలిసారిగా.. కార్మిక ఉద్యమ మ్యూజియంను ఏర్పాటు చేయనుంది కేరళ పర్యాటక శాఖ. ప్రముఖ బాంబే కంపెనీ గతంలో కార్యకలాపాలు నిర్వహిస్తోన్న ఓ సంస్థనే.. మ్యూజియంగా మార్చుతున్నట్టు పేర్కొంది.

India's first Labour Movement museum to come up in Kerala
ఆ రాష్ట్రంలో దేశంలోనే తొలి 'కార్మిక ఉద్యమ మ్యూజియం'!

By

Published : Jan 18, 2021, 6:02 AM IST

కార్మికుల ఉద్యమానికి సంబంధించి దేశంలోనే తొలిసారిగా ఓ మ్యూజియంను ఏర్పాటు చేయనుంది కేరళ ప్రభుత్వం. అలప్పుజలోని హౌస్​బోట్​ పర్యటక కేంద్రంలో ప్రారంభమయ్యే ఈ మ్యూజియంలో.. ప్రపంచ కార్మిక ఉద్యమ చరిత్రకు సంబంధించిన అన్ని అంశాలూ ప్రదర్శితమవుతాయని పర్యాటక శాఖ తెలిపింది. ముఖ్యంగా రాష్ట్రాన్ని ప్రభావితం చేసే అంశాలను భారీ స్థాయిలో ప్రదర్శిస్తామని పేర్కొంది.

దేశంలోనే మొదటిసారిగా ప్రారంభమయ్యే ఈ పురావస్తు ప్రదర్శన శాలలో.. కొచ్చి ఓడరేవు, కోయిర్​(కొబ్బిరి తోటల ఉత్పత్తి) గొప్పదనం, కార్మిక పోరాటానికి సంబంధించిన అంశాలన్నీ భాగమవుతాయని ఓ ప్రకటనలో తెలిపింది. లెఫ్ట్​ డెమొక్రాటిక్ ఫ్రంట్​ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చి.. 100 రోజులైన సందర్భంగా ఈ మ్యూజియాన్ని ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్​ కోసం సుమారు రూ.9.95 కోట్ల రూపాయలు వెచ్చించగా.. ఇప్పటికే 97శాతం పునరుద్ధరణ పనులు పూర్తయినట్టు సమాచారం. ప్రముఖ ఆర్కిటెక్ట్​ డాక్టర్​ బెన్నీ కురియాకోస్​ ఈ మ్యూజియం ప్రాజెక్ట్​ పనులకు నాయకత్వం వహిస్తున్నారు.

బాంబే కంపెనీ గతంలో నడుపుతోన్న 'న్యూ మోడల్​ కోఆపరేటివ్​ సొసైటీ లిమిటెడ్​ సంస్థ'నే.. కార్మిక ఉద్యమ మ్యూజియంగా మార్చారు అధికారులు. పాశ్చాత్య వలసవాదం రాకముందే.. అలప్పుజకు ప్రకృతి సౌందర్యాలు, పురాతన చరిత్ర పరంగా మంచి పేరుంది. ఇక్కడి కోయిర్​(కొబ్బరి)కు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్​ ఉండటం విశేషం.

ఇదీ చదవండి:ఏకాంత చిత్రాలు.. వీడియోలతో భర్త వేధింపులు

ABOUT THE AUTHOR

...view details