మధ్యప్రదేశ్‌లోని ప్రఖ్యాత బాంధవ్‌గఢ్ టైగర్ రిజర్వులో భారతదేశంలోనే తొలిసారి హాట్‌ఎయిర్ బెలూన్ వైల్డ్‌లైఫ్ సఫారీ అందుబాటులోకి వచ్చింది. శుక్రవారం మధ్యప్రదేశ్ అటవీశాఖ మంత్రి విజయ్ షా.. హాట్‌ఎయిర్ బెలూన్ సఫారీని ఉమారియాలో ప్రారంభించారు.
దేశంలో తొలి హాట్ ఎయిర్‌బెలూన్ వైల్డ్‌లైఫ్ సఫారీ
దేశంలో తొలిసారి హాట్ ఎయిర్ బెలూన్ వైల్డ్‌లైఫ్ సఫారీ అందుబాటులోకి వచ్చింది. మధ్యప్రదేశ్‌లోని బాంధవ్‌గఢ్ టైగర్ రిజర్వులో ఈ ప్రాజెక్టును ఆ రాష్ట్ర సర్కార్ ప్రారంభించింది.
దేశంలో తొలి హాట్ ఎయిర్‌బెలూన్ వైల్డ్‌లైఫ్ సఫారీ
ప్రస్తుతం అటవీ ప్రాంతంలోని బఫర్ జోన్‌లో మానవ కార్యకలాపాలు పరిమితం చేసినట్లు విజయ్ షా చెప్పారు. అందుకే హాట్ఎయిర్ బెలూన్ ద్వారా పైనుంచి కింద ఉండే పులులు, చిరుతలు, ఎలుగుబంటులు వంటి ఇతర వన్యప్రాణాలు చూడవచ్చని ఆయన చెప్పారు.
ఇదీ చదవండి:దెయ్యాలకోటగా భయపెడుతోన్న 'భూత్'!