తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఏనుగులకూ ఓ ఆసుపత్రి.. ఎక్కడుందో తెలుసా? - hospital for elephant in mathura

భారీ కాయాలతో, అమాయకమైన వదనాలతో నిదానంగా నడిచే ఏనుగులంటే చిన్నాపెద్దా అందరికీ ఇష్టమే. కానీ, వాటికి ఏ జ్వరమో, గాయమో తగిలి తల్లడిల్లుతుంటే మాత్రం ఎవ్వరూ పట్టించుకోరు. అందుకే, దేశంలోనే తొలిసారిగా ఏనుగుల కోసం ప్రత్యేక వైద్యశాల ఏర్పాటైంది. ఉత్తర్​ప్రదేశ్​లోని ఆ ఆసుపత్రి ఏనుగులకు అండగా నిలుస్తోంది. ఏనుగుల కోసమే ప్రత్యేక సదుపాయాలు కల్పించి వాటి ఆరోగ్యాలను పరిరక్షిస్తోంది.

india's first elephant hospital open in mathura
ఏనుగులకూ ఓ ఆస్పత్రి.. ఎక్కడుందో తెలుసా?

By

Published : Mar 4, 2020, 6:31 AM IST

Updated : Mar 4, 2020, 9:06 AM IST

ఏనుగులకూ ఓ ఆసుపత్రి... ఎక్కడుందో తెలుసా?

దేశంలోనే తొలి ఏనుగుల వైద్యశాలగా ప్రసిద్ధికెక్కింది ఉత్తర్​ప్రదేశ్​ మథురాలోని 'వైల్డ్​లైఫ్​ ఎస్​ఓఎస్ ఎలిఫేంట్​​' ఆసుపత్రి. జిల్లా కేంద్రానికి 40 కి.మీ.ల దూరంలోని చుర్మురా గ్రామంలో స్థాపించిన ఈ ప్రత్యేక వైద్యశాల.. ఆపదలో ఉన్న ఏనుగులకు అండగా నిలుస్తోంది. ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే ఏనుగులు దేశంలో ఏ మూల ఉన్నా.. వాటిని అక్కున చేర్చుకుంటోందీ గజ వైద్యశాల.

ప్రస్తుతం.. ఝార్ఖండ్​, పంజాబ్​, బంగాల్​, కేరళ రాష్ట్రాల నుంచి తీసుకువచ్చిన 9 ఏనుగులు ఇక్కడ చికిత్స పొందుతున్నాయి. అందులో రెండు అంధ గజాలనూ ప్రత్యేక శ్రద్ధతో పరిరక్షిస్తున్నారు ఇక్కడి సిబ్బంది.

"మేము బిర్విన్​ జనపాదాల నుంచి కాపాడి వీటిని ఇక్కడికి తీసుకువస్తాం.. ఏనుగులను తిప్పుతూ భిక్షాటన చేసేవారి నుంచి విడిపిస్తాం. నడవలేని స్థితిలో ఉన్న గజాలను గుళ్లల్లో పూజల కోసం నడిపించేవారి నుంచి, ఏనుగులను కొట్టి, హింసించే వారి నుంచి మేము వాటిని కాపాడుతాం. ప్రభుత్వ అనుమతితో ఇక్కడికి తీసుకొస్తాం. దేశంలో ఏ రాష్ట్రం నుంచి మాకు సమాచారం వచ్చినా మేము ఏనుగులను కాపాడేందుకు ముందుంటాం."

-రాహుల్​ ప్రసాద్​, పశు వైద్యుడు

భారత దేశంలోని ఈ తొలి ఏనుగుల ఆసుపత్రిని 2018 నవంబర్​ 16న ఆగ్రా పోలీస్​ కమిషనర్ ప్రారంభించారు. ఎస్​ఓఎస్​ అధికారులు ఈ ఆసుపత్రిని నిర్వహిస్తున్నారు. ఐదుగురు సభ్యుల వైద్యుల బృందం ఇక్కడ సేవలందిస్తోంది.

ఇక్కడ ఏనుగులు కేవలం చికిత్స మాత్రమే కాదు.. ఆహ్లాదాన్ని, స్వేచ్ఛనూ పొందుతాయని చెబుతున్నారు అక్కడి సిబ్బంది.

"రోజుకు మూడు, నాలుగు సార్లు వీటికి ఆహారం పెడతాం. డాక్టర్​ వచ్చేలోపు స్నానం చేయించి, సిద్ధంగా ఉంచుతాం. డాక్టర్ వైద్యం చేశాక పళ్లు తినిపిస్తాం. ఆ తరువాత వీటిని స్వేచ్ఛగా వదిలేస్తాం. పక్కనే ఓ చెరువు ఉంది, వాటికి వెళ్లాలనిపిస్తే వెళ్తాయి."

-ఆసుపత్రి సిబ్బంది

ఇదీ చదవండి:తొలిసారి ఎక్స్​ప్రెస్ రైలును నడిపి మహిళ ఘనత

Last Updated : Mar 4, 2020, 9:06 AM IST

ABOUT THE AUTHOR

...view details