రాజస్థాన్‌లో అశోక్ గహ్లోత్ ప్రభుత్వం సహా ఇతర రాష్ట్రాల్లో వేరే పార్టీలు అధికారంలో ఉన్న ప్రభుత్వాలను కూల్చేందుకు భాజపా పన్నుతున్న మోసపూరిత కుట్రలను ప్రజలు తిరస్కరిస్తారని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. భారత దేశ ప్రజాస్వామ్యం.. రాజ్యాంగానికి, ప్రజాగొంతుక నుంచి వచ్చే ప్రతిధ్వనికి అనుగుణంగా నడుస్తుందన్నారు. కాంగ్రెస్ చేపట్టిన 'స్పీకప్ఫర్ డెమోక్రసీ' ఆన్లైన్ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు రాహుల్. భాజపాపై విమర్శలు గుప్పించారు. ఈ మేరకు హిందీలో ట్వీట్ చేశారు.
'భాజపా కుట్రలను ప్రజలు తిరస్కరిస్తారు'
రాజ్యాంగానికి , ప్రజాగళానికి అనుగుణంగా భారత ప్రజాస్వామ్యం నడుస్తుందని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. భాజపా మోసపూరిత కుట్రలను ప్రజలు తిరస్కరిస్తారని ఉద్ఘాటించారు. కాంగ్రెస్ నిర్వహిస్తున్న 'స్పీకప్ఫర్డెమోక్రసీ' ఆన్లైన్ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు రాహుల్.
'భాజపా మోసపూరిత కుట్రలను ప్రజలు తిరస్కరిస్తారు'
రాజస్థాన్ మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ తిరుగుబాటుతో ఆ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. దీనికి కారణం భాజపానే అని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించకుండా గవర్నర్ ఆలస్యం చేస్తున్నారని విమర్శిస్తూ సోమవారం రాజ్‌భవన్ ఎదుట నిరసనలు చేపడతామని కాంగ్రెస్ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే భాజపాపై విమర్శలు చేశారు రాహుల్.