దేశంలో కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రతీరోజు కొత్త కేసులు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఆదివారం మరో 66,732 మందికి కరోనా సోకినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్లో తెలిపింది. మరో 816 మంది మరణించారు.
- మొత్తం కేసుల సంఖ్య: 71,20,539
- మొత్తం మరణాలు:1,09,150
- కోలుకున్నవారు:61,49,536
- రికవరీ రేటు:86.36%
- మరణాల రేటు:1.53%