తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా ఉద్ధృతి: దేశంలో మరో 75 వేల కేసులు నమోదు - covid 19 tests in india

భారత్​లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొత్తగా నమోదైన 75 వేల కేసులతో బాధితుల సంఖ్య 65 లక్షలు దాటింది. శనివారం మరో 940 మంది మరణించారు. కోలుకున్నవారి సంఖ్య 55 లక్షలకు పెరిగింది. మరోవైపు పరీక్షల సంఖ్య 7.89 కోట్లకు చేరింది.

India's #COVID19 tally crosses 65-lakh mark with a spike of 75,829 new cases & 940 deaths reported in last 24 hours.
కరోనా ఉద్ధృతి: దేశంలో మరో 75 వేల కేసులు

By

Published : Oct 4, 2020, 10:03 AM IST

Updated : Oct 4, 2020, 10:17 AM IST

దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. శనివారం ఒక్కరోజే 75,829 మందికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. మరో 940 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వివరాలను ఆదివారం వెల్లడించింది కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ.

మొత్తం కేసుల సంఖ్య 65,49,374కు చేరింది. ప్రస్తుతం 9,37,625 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరణాల సంఖ్య 1,01,782కి పెరిగింది. 55 లక్షల మంది డిశ్చార్జి అయ్యారు.

పెరుగుతున్న టెస్టులు

కరోనా కేసులను వేగంగా నిర్ధరించేందుకు పరీక్షల సంఖ్యను గణనీయంగా పెరిగింది. శనివారం ఒక్కరోజే 11,42,131 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది. ఇప్పటివరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 7,89,92,534కు చేరినట్లు అధికారులు వెల్లడించారు.

అక్టోబర్ 3 నాటికి దేశంలో కరోనా పరీక్షల సామర్థ్యం 7.7 కోట్లకు చేరిందని కేంద్ర వైద్య శాఖ తెలిపింది. జనవరిలో ఈ సామర్థ్యం కేవలం ఒకటిగా ఉందని పేర్కొంది. పరీక్షల సంఖ్యను పెంచడం వల్ల కేసులను త్వరగా గుర్తించి.. చికిత్స అందించగలుగుతున్నామని వెల్లడించింది. తద్వారా మరణాలను అడ్డుకోగలుగుతున్నామని స్పష్టం చేసింది.

Last Updated : Oct 4, 2020, 10:17 AM IST

ABOUT THE AUTHOR

...view details