భారత్లో కొవిడ్ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. శుక్రవారం ఒక్కరోజే 65,002 కొత్త కేసులు బయటపడ్డాయి. మరో 996 మంది మృత్యువాతపడ్డారు. మొత్తం కేసుల సంఖ్య 25 లక్షలు దాటింది.
దేశంలో ఇప్పటివరకు 25 లక్షల 26 వేల 193 మందికి కరోనా సోకింది. 6 లక్షల 68 వేలకుపైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరణాల సంఖ్య 49 వేల 036కు చేరింది.