దేశంలో ఓవైపు కరోనా విజృంభిస్తున్నప్పటికీ.. వైరస్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్లు తెలిపింది కేంద్ర ఆరోగ్య శాఖ. కేంద్రం, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సమన్వయంతో అమలుచేస్తున్న సమర్థమైన చికిత్స విధానం, వ్యాధి నిర్ధరణ చర్యలతోనే ఇది సాధ్యమవుతున్నట్లు వెల్లడించింది. యాక్టివ్ కేసుల సంఖ్యతో పోలిస్తే కోలుకున్న వారి సంఖ్య 2,42,362 అధికంగా ఉందని చెప్పింది.
" దేశంలో కరోనా కేసుల రికవరీ రేటు 62.93 శాతానికి చేరింది. అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నందున ఎక్కువ మంది వైరస్ నుంచి కోలుకుంటున్నారు. దేశంలో కేవలం 2,92,258 యాక్టివ్ కేసులు ఉన్నాయి. శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం వరకు 24 గంటల్లో 19,235 మంది కోలుకున్నారు. దాంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 5,34,620కి చేరింది."
- కేంద్ర వైద్య,ఆరోగ్య శాఖ
భారత్లో ఆదివారం ఒక్కరోజే 28,637 కేసులు నమోదయ్యాయి. మరో 551 మంది ప్రాణాలు కోల్పోయారు.
15 వేల కొవిడ్ కేంద్రాలు..